గుర్రపు స్వారీ కోసం బరువుతగ్గుతానంటున్న రేణు దేశాయ్

0
29
renudesai doing horse riding for weight loss

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్-గుర్రపు స్వారీ కోసం నేను బరువు తగ్గే పనిలో ఉన్నానని అంటోంది రేణు దేశాయ్. తాజాగా ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రేణు దేశాయ్. ఒకవైపు వెబ్ సిరీస్ లో నటించడానికి ఒప్పుకున్న ఈభామ మరోవైపు మెగా ఫోన్ చేతబట్టి రైతుల సమస్యల మీద ఓ సినిమా చేయడానికి కూడా రంగం సిద్ధం చేసుకుంది పైగా ఇది సొంత సినిమా కూడా. ఇక గుర్రపు స్వారీ విషయానికి వస్తే ……. రేణు దేశాయ్ కి 12 ఏళ్ల వయసున్నప్పుడే గుర్రపు స్వారీ నేర్చుకుందట. ఇక అప్పటి నుండి రెగ్యులర్ గా స్వారీ చేస్తూనే ఉందట.

renudesai with horse

కాకపోతే మధ్యలో పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకున్న సమయంలో కొంతకాలం గుర్రపు స్వారీ చేయలేదట. సంసారం బాధ్యతలు ఉంటాయి కదా అందువల్ల చేయలేదట. అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ కు విడాకులు ఇచ్చిందో ఇక అప్పటి నుండి మళ్ళీ గుర్రపు స్వారీ చేయడం మొదలు పెట్టిందట. మొత్తానికి 2015 వరకు రెగ్యులర్ గా గుర్రపు స్వారీ చేసిందట రేణు. అయితే మధ్యలో అనారోగ్యం పాలవ్వడంతో గత అయిదేళ్లుగా గుర్రపు స్వారీకి దూరంగా ఉందట. అలాగే అనారోగ్యం వల్ల కాస్త లావు అయ్యింది.

ఇక ఇప్పుడేమో లావు తగ్గే పనిలో పడినట్లు చెబుతోంది. ఎందుకంటే వెబ్ సిరీస్ లో గుర్రపు స్వారీ సన్నివేశాలు కూడా ఉన్నాయట. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటోంది రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లలతో. పవన్ కళ్యాణ్ సరసన బద్రి , జానీ చిత్రాల్లో నటించింది రేణు కట్ చేస్తే 19 సంవత్సరాల తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు వస్తోంది నటిగా. ఇన్నాళ్ల తర్వాత నటిగా ఎలాంటి పాత్రలో కనిపించనుందో అన్న ఆతృత అయితే నెలకొంది ప్రేక్షకుల్లో. 

మునుపటి వ్యాసంసీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ కెరీర్
తదుపరి ఆర్టికల్బండ్ల గణేష్ కు షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి