రెమ్యునరేషన్ తగ్గించుకుంటున్న విజయ్ ఎన్నికల కోసమేనా

0
70

ఇళయదళపతి విజయ్ తన రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి సిద్ధపడ్డాడు. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండటంతో నిర్మాతలకు అండగా ఉండాలని భావించిన విజయ్ ఏకంగా తన రెమ్యునరేషన్ లో 20 శాతం తగ్గించుకున్నట్లుగా దర్శక నిర్మాతలకు చెప్పాడట. 20 శాతం రెమ్యునరేషన్ అంటే దాదాపు 15 కోట్ల పై మాటే ఎందుకంటే నిన్న మొన్నటి వరకు 70 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునే విజయ్ ఇప్పుడు ఏకంగా 100 కోట్ల రెమ్యునరేషన్ స్థాయికి ఎదిగాడు మరి. అంటే ఈలెక్కన 15 నుండి 20 కోట్ల రెమ్యునరేషన్ తగ్గించుకున్నట్లే అని చెప్పాలి.

తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న హీరో కేవలం విజయ్ కావడం గమనార్హం. గతకొంత కాలంగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం గా ఉన్నాడు విజయ్. దాంతో అతడిపై ఐటీ దాడులు జరిగాయి. ఐటీ దాడులతో మరింత కసిగా ఉన్నాడట. తమిళనాట అసెంబ్లీకి 2021 లో ఎన్నికలు రానున్నాయి. దాంతో ఆ ఎన్నికల్లో తన సత్తా చాటాలని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలలో అధికారంలో ఉన్నవాళ్లకు గట్టి బుద్ది చెప్పాలని భావిస్తున్నాడట విజయ్. దాంతో తన రెమ్యునేషన్ తగ్గించుకొని మరింత మంచి పేరు సంపాదించి తమిళనాట ఎన్నికల్లో తన ముద్ర వేయాలని కంకణం కట్టుకున్నాడట.  

మునుపటి వ్యాసంపవన్ కళ్యాణ్ ఇప్పుడే గుర్తొచ్చాడా అంటున్న ఫ్యాన్స్
తదుపరి ఆర్టికల్కేసీఆర్ సర్కారు సంచలన నిర్ణయం: కరోనా టెస్ట్ ఫ్రీ
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి