పవన్ కళ్యాణ్ కోసం మహేష్ ని రిజెక్ట్ చేసాడట

0
50
pawan kalayan vakeel saab will start shoot soon

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్-  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం మహేష్ బాబు సినిమాని రిజెక్ట్ చేసాడు కెమెరామెన్ పీఎస్ వినోద్. అవును ఈ వార్త నిజమే ! పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రానికి కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నాడు పీఎస్ వినోద్ అదే సమయంలో మహేష్ బాబు హీరోగా నటించనున్న సర్కారు వారి పాట చిత్రానికి కూడా పీఎస్ వినోద్ ని కెమెరామెన్ గా ఎంపిక చేసారు దర్శకులు పరశురామ్. వకీల్ సాబ్ ఇక అయిపోయినట్లే కాబట్టి మహేష్ బాబు సినిమా ఎంచక్కా చేయొచ్చు అని అనుకున్నాడు అందుకే ఒప్పుకున్నాడు.

అయితే కరోనా మహమ్మారి వల్ల వకీల్ సాబ్ షూటింగ్ ఇంకా అయిపోలేదు. బ్యాలెన్స్ గా ఉన్న సన్నివేశాలను త్వరలోనే చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక కరోనా ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ చేయాలనీ సర్కారు వారి పాట యూనిట్ కూడా అనుకుంటున్నారు. అంటే రెండు సినిమాలు కూడా వెంటవెంటనే జరుగుతాయి కాబట్టి రెండు సినిమాలకు డేట్స్ కేటాయించలేడు దానికి తోడు సర్కారు వారి పాట అమెరికాలో షూటింగ్ జరుగనుంది.

వకీల్ సాబ్ మాత్రం హైదరాబాద్ లో షూటింగ్ జరుగనుంది అంటే రెండు చిత్రాలను చేయడం కష్టం కాబట్టి వకీల్ సాబ్ కొంత భాగమే షూటింగ్ ఉంది కాబట్టి దాన్ని కంప్లీట్ చేయాలనీ డిసైడ్ అయ్యాడట పీఎస్ వినోద్. అందుకే మహేష్ బాబు సినిమాని పక్కన పెట్టాడట. దాంతో మహేష్ బాబు కోసం మరో కెమెరామెన్ ని పట్టుకునే పనిలో పడ్డారట దర్శకుడు పరశురామ్. మహేష్ సర్కారు వారి పాట బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో రూపొందుతున్న సినిమా అయితే వకీల్ సాబ్ మాత్రం అమ్మాయిల అఘాయిత్యాలపై సాగే సినిమా కావడం విశేషం.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి