అతడి సినిమాలో కలిసి నటించాలని ఆశపడుతున్నాడు రెబల్ స్టార్ కృష్ణంరాజు

0
52
krishnam raju wants act with prabhas
టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కావడంతో అతడి సినిమాలో కలిసి నటించాలని ఆశపడుతున్నాడు రెబల్ స్టార్ కృష్ణంరాజు. రెబల్ స్టార్ వారసుడిగా అడుగుపెట్టిన ప్రభాస్ పెద్ద నాన్న కృష్ణంరాజుతో కలిసి నటించాడు. అయితే అందులో బిల్లా మంచి విజయం సాధించగా రెబల్ మాత్రం డిజాస్టర్ అయ్యింది. అయితే ఆ సినిమాలు ప్రభాస్ మాములు హీరోగా ఉన్నప్పుడు నటించినవి కానీ ఇప్పుడు ప్రభాస్ రేంజ్ అనూహ్యంగా మారిపోయింది.


ఇప్పుడు ప్రభాస్ రేంజ్ చెప్పాలంటే అసలు సిసలైన ఇండియన్ సూపర్ స్టార్ హీరో అందుకే అలాంటి ఇమేజ్ వచ్చిన తర్వాత ప్రభాస్ తో కలిసి చిన్న పాత్రలోనైనా సరే నటించాలని కోరికగా ఉందట కృష్ణంరాజుకు. ఇదే విషయాన్ని ప్రభాస్ కు చెప్పాడట దాంతో పెద్ద నాన్న కోరిక నెరవేర్చడానికి ఆది పురుష్ దర్శకుడు ఓం రౌత్ తో మాట్లాడాడట. పెద్ద నాన్న ఆల్రెడీ నటుడు పైగా అప్పట్లో టాలీవుడ్ లో టాప్ హీరోలలో ఒకడు కాబట్టి ఆయనకు తగ్గట్లుగా ఓ మంచి పాత్ర ఇవ్వండి చిన్నదైనా ఫరవాలేదు ఇంపాక్ట్ ఉండేలా ఉండాలి అని చెప్పాడట.

స్వయంగా హీరో అడగడం దర్శకుడు కాదనకపోవడమా ? అందుకే కృష్ణంరాజుకు సరిపోయే పాత్ర ని సెలెక్ట్ చేసే పనిలో పడ్డాడట దర్శకుడు ఓం రౌత్. పెద్ద నాన్న కృష్ణంరాజు అసలు కోరిక ఏంటంటే ప్రభాస్ త్వరగా పెళ్లి చేసుకోవాలని. కానీ గతకొన్ని సంవత్సరాలుగా వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉన్నాడు ప్రభాస్. మొదట బాహుబలి సినిమా కంప్లీట్ అయ్యాక అని అన్నాడు ఇక ఇప్పుడేమో బాహుబలి అడ్డు లేదు కానీ పెళ్లి ఊసెత్తడం మాత్రం లేదు ఏంటో ? బొమ్మాలి గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ప్రభాస్ పెళ్లి అయ్యేలా కనబడుతోంది. ఇక ఆ బొమ్మాలి ఎవరో అందరికీ తెలిసిందే …….  కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా ? 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి