3 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించేందుకు రంగం సిద్ధమైంది

0
46

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 3 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించేందుకు రంగం సిద్ధమైంది. ఈ తతంగం అంతా చేస్తున్నది ఎవరో కాదు సుమా ….. ఇంకెవరు మనిషి రూపంలో దేవుడు సోనూ సూద్. కరోనా రక్కసితో కోట్లాది మంది ఉద్యోగాలు పోయాయి దాంతో వాళ్ళంతా రోడ్డున పడ్డారు. ఇక వలస కార్మికుల వెతలు ఎంత తక్కువ చెబితే అంత మంచిది ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు మనదేశంలో ఎక్కువ. అలాంటి వాళ్ల కోసం అలాగే నైపుణ్యం ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాని వాళ్ళ కోసం రకరకాల సంస్థలతో మాట్లాడి 3 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించేందుకు రెడీ అయ్యాడు సోనూ సూద్.

లాక్ డౌన్ సమయంలో ఒక్కసారిగా సోనూ సూద్ సూపర్ హీరో అయ్యాడు. వేలాది మంది వలస కార్మికులను తన స్వంత ఖర్చులతో స్వగ్రామలకు పంపించాడు. అలాగే ఏది తన దృష్టికి వచ్చినా వెంటనే స్పందిస్తున్నారు. కరోనా వల్ల కోట్లాది మంది జీవితాలు తలకిందులు కావడంతో తన శక్తి మేరకు సహాయం అందించాలని భావించిన తరుణంలో పలు సంస్థలు సోనూ సూద్ చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై ఈ బంపర్ ఆఫర్ ఇచ్చారట. దాంతో సోనూ సూద్ వల్ల మనదేశంలో రాబోయే కొద్ది రోజులలోనే 3 లక్షల మందికి ఉపాధి లభించనుంది. అంటే ప్రత్యక్షంగా 3 లక్షల మంది అంటే పరోక్షంగా 10 లక్షల మందికి పైగానే లాభం చేకూరనుందన్న మాట.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి