అడల్ట్ కంటెంట్ తో రవిబాబు ‘క్రష్’ ఫస్ట్ పీప్

0
49
crrush moviet railer released

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్విభిన్న కథా చిత్రాలను రూపొందించే రవిబాబు తాజాగా అడల్ట్ కంటెంట్ తో ” క్రష్ ” అనే చిత్రాన్ని రూపొందించాడు. తాజాగా ఈ సినిమానుండి ఫస్ట్ పీప్ అంటూ 3 నిమిషాలకు పైగా నిడివి ఉన్న వీడియోని విడుదల చేసాడు. ఆ వీడియో బూతులతో నిండి ఉంది. అభయ్ సింహా , కృష్ణ బూరుగుల , చరణ్ సాయి , అంకిత మనోజ్ , శ్రీ సుధా రెడ్డి , పర్రీ పాండే , తదితరులు ఈ చిత్రంలో నటించారు.

ఈ వీడియో మొదట్లోనే అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమా అనే విధంగా 18 సంవత్సరాలు ఆపై ఉన్నవాళ్ళ అభీష్టానుసారం అంటూ అసలు విశేషాన్ని వెల్లడించాడు రవిబాబు. అంటే అడల్ట్ కంటెంట్ తో ఈ చిత్రాన్ని రూపొందించాను అని చెప్పడమే కాకుండా పోస్టర్ ను కూడా యమా రంజుగా రూపొందించాడు. ఒక యువతి అర్ద నగ్నంగా అరకొర దుస్తులతో ఉంటే ఆమెని ముగ్గురు యువకులు ఇష్టానుసారం హత్తుకుంటూ ఊహాలోకాల్లో తేలిపోతున్నట్లుగా పోస్టర్ రూపొందించాడు.

ఈ పోస్టర్ చూస్తుంటేనే అర్ధం అవుతోంది ఎంత దారుణంగా ఉండబోతోందో. ఇక యువతరంని అలరించాలనే ప్రయత్నంలో ఇలాంటి అడల్ట్ కంటెంట్ ఉన్న చిత్రాలు విచ్చలవిడిగా తెలుగునాట వస్తూనే ఉన్నాయి. అయితే మరీ దారుణంగా ఉన్న డైలాగ్స్ వల్ల ఇది వెండితెరపై రావడం కష్టమే ! బహుశా ఒటిటి ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఒటిటి ఫ్లాట్ ఫామ్ లోనే విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది.

మునుపటి వ్యాసం50 ఏళ్ళు రాబోతున్న ఇంకా పెళ్లి ఊసెత్తని భామ
తదుపరి ఆర్టికల్కంగనా ఇల్లు కూల్చివేతపై సీరియస్ అయిన గవర్నర్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి