రాత్ అకేలి హై ట్రైలర్ తో పెరిగిన అంచనాలు

0
61

నవాజుద్దీన్ సిద్ధిఖీ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన చిత్రం రాత్ అకేలి హై. సంచలన తార రాధికా ఆఫ్టే ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదల అయ్యింది. ఓ సంపన్న కుటుంబానికి చెందిన పెద్ద హత్య చేయబడటంతో ఆ కేసుని పరిశోధించే క్రమంలో ఓ సాధారణ పోలీస్ అధికారి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు , ఆ ఇబ్బందులను అధిగమించి హత్య వెనకాల ఉన్న అసలు దోషులను ఎలా పట్టుకున్నాడు అన్న కథాంశంతో తెరకెక్కింది రాత్ అకేలి హై.

తాజాగా విడుదలైన ట్రైలర్ తో రాత్ అకేలి హై చిత్రంపై అంచనాలు పెరిగాయి. నవాజుద్దీన్ సిద్దిఖీ మంచి పెర్ఫార్మర్ అన్న సంగతి తెలిసిందే. అలాగే రాధికా ఆఫ్టే గురించి కొత్తగా చెప్పేదేముంది నటనలో కొట్టినపిండి. ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమా అంటే తప్పకుండా కథలో విషయం ఉన్న సినిమానే అని అనుకుంటారు. దానికి తోడు ట్రైలర్ ఆకట్టుకునేలా రూపొందించి వదిలారు ఇంకేముంది ప్రేక్షకులను అలరించడం ఖాయమని ధీమాగా ఉన్నారు. అయితే థియేటర్లు కరోనా వల్ల మూత పడ్డాయి కాబట్టి ఈ సినిమా ఈనెల 31న నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది

 

మునుపటి వ్యాసండర్టీ హరి ట్రైలర్
తదుపరి ఆర్టికల్రాత్ అకేలి హై ట్రైలర్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి