రేటు తగ్గించిన హాట్ భామ

0
22

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన రెమ్యునరేషన్ ని సగానికి సగం తగ్గించుకుందట. ఇంతకుముందు ఒక్కో సినిమాకు కోటి నుండి కోటిన్నర రెమ్యునరేషన్ అందుకునే రకుల్ ప్రస్తుతం చేతిలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అసలే కరోనా వల్ల థియేటర్లు మూత పడ్డాయి. దాంతో షూటింగ్ లన్నీ ఆగిపోయాయి. దాదాపు నాలుగు నెలలుగా ఎలాంటి షూటింగ్ లు లేవు అలాగే భవిష్యత్తులో షూటింగ్ లు ఎప్పుడు మొదలు అవుతాయో కూడా తెలియడం లేదు దాంతో రకుల్ ప్రీత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

నాగార్జున సరసన మన్మథుడు 2 లో నటించిన తర్వాత రకుల్ కు మళ్లీ ఛాన్స్ లు లభించలేదు. ఒకవేళ కొన్ని ఛాన్స్ లు వచ్చినా అవి ఆమెకు నచ్చలేదు. అలాగే కొన్ని ప్రాజెక్ట్ లు ఆమె వరకు వెళ్లడం లేదు. మధ్యలో ఉండేవాళ్ళు యంగ్ టాలెంట్ ని తొక్కేస్తున్నారు. కొత్త కొత్త కథలతో వస్తున్న వాళ్ళని రకుల్ ప్రీత్ సింగ్ వరకు వెళ్లనీయకుండా జాగ్రత్త పడుతున్నారు. దాంతో పాపం కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది రకుల్ ప్రీత్. తాజాగా నితిన్ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మరి కరోనా ఎప్పుడు తగ్గుతుందో ఈ భామ ఎప్పుడు షూటింగ్ లో పాల్గొంటుందో చూడాలి.  

 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి