ఆ హీరో మోసం చేసాడట ఈ హీరోయిన్ ని

0
28
Ranbir Kapoor Cheating To Deepika Padukone

రణబీర్ కపూర్ నన్ను రెండుసార్లు మోసం చేసాడని , రెండుసార్లు కూడా రెడ్ హ్యాండెడ్ గా అతడు తప్పుచేస్తుంటే పట్టుకున్నానని సంచలన వ్యాఖ్యలు చేస్తోంది హీరోయిన్ దీపికా పదుకోన్. రణ్వీర్ సింగ్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని హాయిగా కాపురం చేస్తున్న భామ అంతకుముందు మరో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ని ప్రేమించింది. రణబీర్ కపూర్ కూడా దీపికా ని పీకల్లోతు ప్రేమలో ఉన్నానని నమ్మించాడు.

ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని బాగానే తిరిగారు ఇక పెళ్లి చేసుకోవడమే అని అనుకుంటున్న తరుణంలో ఇద్దరూ విడిపోయారు. అలా విడిపోవడానికి కారణం రణబీర్ కపూర్ చేసిన మోసమే అని అంటోంది దీపికా. నన్ను ప్రేమిస్తూనే మరోవైపు ఇతరులతో కూడా ఎఫైర్ నడిపించాడట హీరో దాంతో అతడ్ని నిలదీయడంతో తప్పు ఒప్పుకొని ఇకపై అలాంటి పనులు చేయనని మాటిచ్చాడట. కట్ చేస్తే మరొకరితో రొమాన్స్ చేస్తూ తన కంట పడ్డాడు రణబీర్ కపూర్. దాంతో అతడికి బ్రేకప్ చెప్పి రణ్వీర్ సింగ్ ని పెళ్లి చేసుకుంది దీపికా పదుకోన్.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి