ప్రభాస్ సినిమాలో రానా

0
22

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో రానా నటించనున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్లో వార్తలు షికారు అవుతున్నాయి. ఆల్రెడీ బాహుబలి చిత్రంలో ఈ ఇద్దరూ హీరో విలన్ లుగా నటించి ప్రభంజనం సృష్టించారు. కట్ చేస్తే ఇన్నాళ్లకు మళ్లీ కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ తాజాగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆ సినిమాకి రాధే శ్యామ్ అనే టైటిల్ ని అనుకుంటున్నారు. ఇంకా అధికారికంగా టైటిల్ ని ప్రకటించలేదు కానీ ఇదే టైటిల్ కన్ఫర్మ్ అని మాత్రం తెలుస్తోంది.

ఇక ఇదే చిత్రంలో రానా స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. కేవలం 5 నిమిషాల సేపు మాత్రమే రానా కనిపించనున్నాడట. చర్చలు జరిగాయని , తెరపై మళ్లీ ప్రభాస్ , రానా లను చూడటం ఖాయమని అంటున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే తప్పకుండా ప్రభాస్ అభిమానులతో పాటుగా రానా అభిమానులకు కూడా సంతోషకరమైన వార్త అనే చెప్పాలి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం కోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్టింగులు వేస్తున్నారు. ఎక్కువగా ఫారిన్ లొకేషన్స్ ఉండటంతో , ఇప్పటికే కొన్ని సన్నివేశాలు చిత్రీకరించి ఉండటంతో దాని తాలూకు సెట్టింగులు వేస్తున్నారు.

 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి