పవన్ కళ్యాణ్ పోస్టర్ పై సెటైర్ వేసిన వర్మ

0
33
ram gopal varma satire on pawan kalyan vakeel saab movie poster

వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ పోస్టర్ పై సెటైర్ వేసి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. అనునిత్యం ఎవరో ఒకరిని విమర్శించడమో లేక పొగడటమో చేసే వర్మ తాజాగా పవన్ కళ్యాణ్ పోస్టర్ కు పోటీగా తన పోస్టర్ ని కూడా విడుదల చేసి సంచలనం సృష్టించాడు. నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నవకీల్ సాబ్టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే.

పవన్ కళ్యాణ్ పోస్టర్ కు విపరీతమైన స్పందన వచ్చింది. పవన్ వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ రావడమే  ఆలస్యం డైరెక్టర్ సాబ్ అనే తన లుక్ ని కూడా విడుదల చేసాడు రాంగోపాల్ వర్మ. పోస్టర్ కు కూడా మంచి స్పందన వస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కు పోలిక పెడుతూ తన పోస్టర్ ని విడుదల చేయడం మాత్రం పవన్ ఫ్యాన్స్ కు నచ్చలేదు. దిల్ రాజు నిర్మిస్తున్న వకీల్ సాబ్ చిత్రాన్ని మే 15 భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రెండేళ్ల గ్యాప్ తర్వాత పవన్ సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి