ఫ్యాన్స్ కు విజ్ఞప్తి చేస్తున్న చరణ్

0
13
Charan completed the challenge

ఈనెల 27 మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ పుట్టినరోజు కావడంతో తమ అభిమాన హీరో పుట్టినరోజు సందర్బంగా పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మెగా అభిమానులు అయితే కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి నా పుట్టినరోజు వేడుకలు జరపొద్దు అంటూ తన అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాడు చరణ్. పెద్ద సంఖ్యలో అభిమానులు గుమి కూడవద్దంటూ సలహా ఇస్తున్నాడు చరణ్.

అభిమానులకు అభిమాన హీరో పుట్టినరోజు అంటే పెద్ద పండగే కదా ! కానీ కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటంతో జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాడు చరణ్. తాజాగా హీరో ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా ఏడాది వస్తుందని అనుకున్నారు కట్ చేస్తే 2021 జనవరి అంటున్నారు అయితే కరోనా ఎఫెక్ట్ తో అప్పుడైనా విడుదల అవుతుందా ? లేదా ? అన్న డైలమా నెలకొంది

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి