చరణ్ వీడియోకు గూస్ బంప్స్ !

0
17
Ram Charan’s First Look Video from RRR Movie

ఈరోజు రాంచరణ్ పుట్టినరోజు కావడంతో ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని చరణ్ పాత్రకు సంబందించిన విజువల్ విడుదల చేసారు దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చరణ్ వీడియోకు గూస్ బంప్స్ వస్తుంటే రెండు కళ్ళు సరిపోవడం లేదంటూ మెగా ఫ్యాన్స్ పరవశించి పోతున్నారు. ఇక చరణ్ తండ్రి చిరంజీవి అయితే అల్లూరి సీతారామరాజు గెటప్ లో ఉన్న చరణ్ వీడియో చూస్తూ మైమరిచిపోతున్నాడు.

చరణ్ కు నిజమైన పుట్టినరోజు ఇదే అంటూ అసలైన గిఫ్ట్ చరణ్ కు అంటూ ఎన్టీఆర్ కు , రాజమౌళి కి కృతఙ్ఞతలు తెలిపాడు. ఎంతైనా పుత్రోత్సాహం కదా ! చరణ్ విజువల్స్ చూసి పరవశించి పోతున్నాడు చిరంజీవి. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో చరణ్ విజువల్స్ తో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ వీడియో అటు నందమూరి అభిమానులను ఇటు మెగా అభిమానులను అందరినీ అలరిస్తోంది. చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నాడు. 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నాడు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి