వికారాబాద్ అడవుల్లో రకుల్ షూటింగ్

0
44
recived notice from ncb

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్డ్రగ్స్ కేసు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు లీక్ అయినప్పటి నుండి మీడియాలో తెగ నానుతోంది రకుల్ ప్రీత్ సింగ్ పేరు. అయితే రకుల్ పేరు లీక్ అయినప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని వికారాబాద్ అడవుల్లో షూటింగ్ లో పాల్గొంది. అక్కడికి మీడియా వస్తుందేమో అన్న అతృతతో షూటింగ్ లొకేషన్ నుండి హైదరాబాద్ వచ్చి అక్కడి నుండి ఢిల్లీ వెళ్లి కోర్టుని ఆశ్రయించింది. డ్రగ్స్ కేసులో నా పేరు వాడుతూ నా ఇమేజ్ దెబ్బ తీస్తున్నారు కాబట్టి అలాంటి వాటిని నిరోధించండి అంటూ. రకుల్ అభ్యర్ధనని సమర్ధించిన కోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

కట్ చేస్తే ఢిల్లీ నుండి మళ్ళీ హైదరాబాద్ కు వచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా మళ్ళీ వికారాబాద్ అడవుల్లో షూటింగ్ లో పాల్గొంటోంది. క్రిష్ దర్శకత్వంలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన. ఈ సినిమా ఇంకా విడుదల కాకుండానే రెండో సినిమాని క్రిష్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఆ చిత్రంలోనే పల్లెటూరి యువతిగా నటిస్తోంది రకుల్ . తెలుగులో ఈ భామకు ఉన్న ఏకైక చిత్రం ఇదే. హిందీలో అలాగే తమిళ్ లో రెండు చిత్రాల్లో నటిస్తోంది కానీ తెలుగులో మాత్రం ఈ భామకు ఉన్న సినిమా ఇదే. అసలే చేతిలో పెద్దగా సినిమాలు లేవంటే డ్రగ్స్ కేసులో ఆరోపణలు రకుల్ ని బాధపెడుతున్నాయి. అయినా వాటిని పక్కన పెట్టి షూటింగ్ లో పాల్గొంటోంది. మీడియా వాళ్ళు హద్దుల్లో ఉంటే మంచిదని హితువు పలుకుతూ పలువురికి నోటీసులు పంపించింది. అయితే నోటీసులు పంపించినప్పటికీ కొంతమంది మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తూనే ఉన్నారు. 

మునుపటి వ్యాసంకేటీఆర్ కు సవాల్ గా మారనున్న ఎన్నికలు
తదుపరి ఆర్టికల్ఏపీలో స్టూడియో కడతానంటున్న పోసాని
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి