తప్పు చేసానని బాధపడుతున్న రకుల్

0
36
Rakul preet singh suffering from wrong Glamor Characters

నేను చాలా తప్పులు చేసానని బాధపడుతోంది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. ఇంతకీ ఈ భామ చేసిన తప్పులు ఏంటో తెలుసా …… ఎక్కువ చిత్రాల్లో గ్లామర్ గా నటించడమేనట ! అవును గ్లామర్ పాత్రలలో ఎక్కువగా నటించానని అందుకే నాకు తెలుగులో అంతగా మంచి అవకాశాలు రావడం లేదని బాధపడుతోంది. అయితే ఇపుడు బాధపడి ఏం ప్రయోజనం ! ఇప్పటికే ఈ భామ చేతిలో సరిగ్గా సినిమాలు లేవు ఉన్న సినిమాలు కూడా అంతగా వర్కౌట్ అయ్యేవి కూడా కాదు.

గ్లామర్ కు ఇచ్చిన ప్రాధాన్యత నటనకు ఇచ్చి ఉంటే మరో లెవల్ లో ఉండేదని వాపోతోంది రకుల్ ప్రీత్ సింగ్. పాపం ఈ భామకు తెలుగులో సినిమాలు లేకుండాపోయాయి. ఇక తమిళంలో మాత్రం రెండు చిత్రాల్లో నటిస్తోంది అవి ఈ భామకు ఉపయోగపడతాయా ? లేదా ? అన్నది చూడాలి. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రకుల్ వెంటనే తన స్టార్ డం ని కోల్పోయింది. ఇప్పుడేమో ఛాన్స్ ల కోసం ఆరాటపడుతోంది పాపం. నాగార్జున సరసన మన్మథుడు 2 చిత్రంలో నటించిన తర్వాత రకుల్ కు సినిమాలు లేకుండాపోయాయి. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి