కరణం మల్లీశ్వరి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్

0
45
rakul preeth singh

తెలుగునాట కూడా బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. బాలీవుడ్ లో పలు బయోపిక్ చిత్రాలు సంచలన విజయాలను అందుకున్నాయి. అలాగే తెలుగులో కూడా మంచి విజయాలను అందుకున్నాయి దాంతో పలు బయోపిక్ లు తెరకెక్కించే పనిలో పడ్డారు. తాజాగా వెయిట్ లిఫ్ట్ లో సంచలనం సృష్టించిన కరణం మల్లీశ్వరి బయోపిక్ తెలుగులో తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు ప్రముఖ రచయిత కోన వెంకట్. మహిళా దర్శకురాలు సంజనా రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో కరణం మల్లీశ్వరి పాత్రలో హాట్ భామ రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

రకుల్ ప్రీత్ సింగ్ కు ఫిట్ నెస్ లో తిరుగులేని భామ అనే విషయం తెలిసిందే. రకరకాల ఎక్సర్ సైజ్ లతో తన ఫిట్ నెస్ నిరూపించుకుంటూనే ఉంది. పైగా మంచి హైట్ కూడా ఉన్న భామ కావడంతో కరణం మల్లీశ్వరి పాత్రకు ఎంపిక చేశారట. కోన వెంకట్ ప్రాజెక్ట్ కావడంతో మొహమాటం లేకుండా ఒప్పుకుందట రకుల్ ప్రీత్ సింగ్. కరోనా తగ్గిన తర్వాత కరణం మల్లీశ్వరి సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. రకుల్ కరణం మల్లీశ్వరి పాత్రలో ప్రేక్షకుల నీరాజనాలను అందుకోవడం ఖాయం.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి