సంచలన నిర్ణయం తీసుకున్న రజనీకాంత్

0
18
సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2021 జనవరి వరకు ఎలాంటి షూటింగ్ లకు వచ్చేది లేదని మొహమాటం లేకుండా చెప్పాడట. తాజాగా రజనీకాంత్ అన్నాతే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆ సినిమా షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఈలోపు కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండటంతో మూడు నెలలుగా షూటింగ్ లన్నీ ఆగిపోయాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టకముందే మళ్లీ షూటింగ్ లు చేయాలని ఉబలాటపడ్డారు.

రజనీకాంత్ మాత్రం కాస్త తగ్గిన తర్వాత షూటింగ్ లకు వెళదామని అనుకున్నాడు కానీ కరోనా తగ్గుముఖం పట్టకపోగా తమిళనాట మరింత ఉదృతం అవుతోంది. ఒకటి రెండు రోజుల్లోనే లక్ష దాటేలా కనబడుతోంది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే శీతాకాలం లో కూడా వ్యాధులు ప్రబలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జనవరి 2021 వరకు షూటింగ్ లకు వచ్చేది లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడట రజనీకాంత్. అంటే మరో ఆరు నెలల పాటు రజనీకాంత్ సినిమాకు డుమ్మా కొట్టనున్నాడన్న మాట.  

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి