రజనీకాంత్, విజయ్ లపై సంచలన ఆరోపణలు చేసిన హీరోయిన్

0
53

సూపర్ స్టార్ రజనీకాంత్ , ఇళయ దళపతి విజయ్ లపై సంచలన ఆరోపణలు చేస్తోంది హీరోయిన్ మీరా మిథున్. తమిళ ఇండస్ట్రీలో నా ఎదుగుదలకు అడ్డుగా ఉంది కేవలం రజనీకాంత్, విజయ్ లు మాత్రమే నని సంచలన ఆరోపణలు చేసింది. నాకు అవకాశాలు రాకుండా కట్టడి చేస్తోంది ఈ ఇద్దరు స్టార్స్ అంటూ పొంతన లేని ఆరోపణలు చేస్తోంది మీరా మిథున్. అంతేకాదు రజనీకాంత్ ని కండక్టర్ అంటూ సంభోదించింది, అలాగే విజయ్ ఓ క్రిస్టియన్ అంటూ ఓ మతానికి అంటగట్టేసింది. ఇలాంటి సంచలన ఆరోపణలు ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు కానీ చీప్ పబ్లిసిటీ కోసం మీరా మిథున్ ఇంతటి సాహసానికి ఒడిగట్టింది.

తమిళ రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొంది మీరా మిథున్. ఆ షోలో కూడా ఇలాగే ఆరోపణలు చేయడమే కాకుండా తనని లైంగికంగా వేధించారని కూడా వ్యాఖ్యానించి సంచలనం సృష్టించింది అప్పట్లో. ఇలా ఎలా పడితే అలా మాట్లాడటం వల్ల ఫేమస్ అయిపోవచ్చు అని అనుకుంటుందో ఏమో కాని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతోంది. స్టార్ హీరోలను అవమాణిస్తోంది మీరా మిథున్. దాంతో ఈ భామ పై రజనీకాంత్ అభిమానులు, విజయ్ అభిమానులు చాలా కోపంగా ఉన్నారు. మా హీరోలను అవమాణిస్తే సహించేది లేదని మీరా మిథున్ ని హెచ్చరిస్తున్నారు తలైవా ఫ్యాన్స్.  

మునుపటి వ్యాసంవైరస్ గాండ్లపై నిప్పులు కక్కిన కొరటాల శివ
తదుపరి ఆర్టికల్యాత్ర డైరెక్టర్ తో అల్లు అర్జున్ పొలిటికల్ మూవీ
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి