సంచలన ప్రకటన చేసిన రజనీకాంత్

0
29
rajinikanth shocking decision on political career

నేను రాజకీయాల్లోకి వస్తున్నాను , పార్టీ పెడుతున్నాను అయితే ముఖ్యమంత్రి పీఠం మాత్రం తీసుకోను అంటూ సంచలన ప్రకటన చేసాడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఈరోజు తమిళనాడులో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన రజనీకాంత్ రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు స్పష్టం చేసాడు. ఇప్పుడే కాదు రెండేళ్ల క్రితమే నేను పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించాను. తమిళనాడులో కరుణానిధి , జయలలిత మరణాలతో రాజకీయ శూన్యత ఏర్పడింది అందుకే నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అని స్పష్టం చేసాడు రజనీకాంత్.

అయితే రజనీకాంత్ మాత్రం ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడట ! ఎందుకంటే నాకు ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చే ఏడాది నాటికీ నాకు 71 ఏళ్ళు అవుతాయి అప్పుడు ఆ వయసులో సీఎం కుర్చీలో కూర్చోవడం భావ్యం కాదు బాగా చదువుకున్న యువకుడికి సిఎంపదవి ఇస్తానని సంచలన వ్యాఖ్యలు చేసాడు రజనీకాంత్. అయితే తమ అభిమాన హీరో సీఎం కాకుండా మరొకరికి ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే అభిమానులు ఒప్పుకుంటారా ? చూడాలి. నేనైతే రాజకీయాల్లోకి వస్తున్నాను కానీ ప్రజల్లో మార్పు రాకపోతే అది ప్రజలకే నష్టమని హెచ్చరిస్తున్నాడు రజని.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి