రజనీకాంత్ రెమ్యునరేషన్ 100 కోట్లా ?

0
21

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా శివ దర్శకత్వంలో అన్నాతే చిత్రంలో నటిస్తున్నాడు. మీనా కుష్బూ తదితరులు నటిస్తున్న ఆ చిత్రం తర్వాత విలక్షణ నటుడు కమల్ హాసన్ రజనీకాంత్ తో ఓ భారీ సినిమా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈ చిత్రానికి యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నాడట. ఇక ఈ చిత్రానికి గాను రజనీకాంత్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా…… 100 కోట్లు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజమే నట. అసలు 100 కోట్లు కాదు 100 కోట్ల పైనే రజనీకాంత్ పారితోషికం ఉండనుంది అని తెలుస్తోంది.

రజనీకాంత్ – కమల్ హాసన్ లు ఇద్దరు కూడా ఒకేసారి సినిమారంగంలో అడుగుపెట్టారు. తమిళనాట ఎంజీఆర్, శివాజీ గణేషన్ ల తర్వాత ఆ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందింది ఈ ఇద్దరే. రజనీకాంత్ – కమల్ ఇద్దరు కూడా మంచి మిత్రులు. కమల్ కు ఎక్కువ గౌరవం ఇస్తాడు రజనీకాంత్ ఎందుకంటే తనకంటే ఎక్కువ ప్రతిభ కలిగిన వాడు అని. మొత్తానికి ఈ ఇద్దరూ కలిసి అప్పట్లో కొన్ని చిత్రాల్లో నటించారు. ఇక ఇప్పుడేమో రజనీకాంత్ హీరోగా కమల్ సినిమా నిర్మించడం అంటే విశేషమే మరి. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి