రాజశేఖర్ , నాని , రవితేజ లకు ఛాలెంజ్ విసిరిన డైరెక్టర్

0
81
TMN logo
TMN logo

అ, కల్కి చిత్రాలతో విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ హీరోలు డాక్టర్ రాజశేఖర్ , రవితేజ , నాని లకు ఛాలెంజ్ విసిరాడు. ఇంతకీ ప్రశాంత్ వర్మ విసిరిన ఛాలెంజ్ ఏంటో తెలుసా…… మొక్కలు నాటమని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరాడు ప్రశాంత్ వర్మ. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించాడు. దాన్ని సినిమారంగంలోని పలువురు హీరోలు , హీరోయిన్ లు , డైరెక్టర్ లు ఇతర సాంకేతిక నిపుణులు కూడా పాల్గొంటున్నారు.

తాజాగా ప్రశాంత్ వర్మ హైదరాబాద్ లోని మణికొండ లో గల తన కార్యాలయంలో మొక్కలు నాటి రాజశేఖర్ , రవితేజ , నాని లకి ఈ సవాల్ చేశారు. రాజశేఖర్ తో కల్కి అనే సినిమా చేసాడు ప్రశాంత్ వర్మ. నాని నిర్మించిన అ చిత్రంతోనే ప్రశాంత్ వర్మ దర్శకుడు గా పరిచయం అయ్యాడు. ఇక రవితేజ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు ఈ యువ దర్శకుడు. దాంతో ఈ ముగ్గురినీ సవాల్  చేసాడు. మరి ఈ ముగ్గురు హీరోలలో ఎవరు ప్రశాంత్ వర్మ ఛాలెంజ్ ని స్వీకరిస్తారో చూడాలి.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి