నిరుపేద కళాకారులకు నిత్యావసర సరుకులు అందజేసిన రాజశేఖర్ ఛారిటబుల్ ట్రస్ట్

0
33
Rajasekhar Charitable Trust donates essentials to poor artists

రోటీ కపడా ఔర్ మకాన్ అంటే… ఆహారం, దుస్తులు, తల దాచుకోవడానికి ఓ గూడు (ఇల్లు)… హాయిగా జీవితం సాగించడానికి మనుషులకు కావాల్సిన‌వి. ఇల్లు, దుస్తులు ఉన్నప్పటికీ… కరోనా కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో సరైన ఆహారం దొరకక కొంతమంది కష్టపడుతున్నారు. ముఖ్యంగా ఏ రోజుకు ఆ రోజు పని చేస్తే తప్ప ఇల్లు గడవని నిరుపేద కళాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ పెద్ద మనసుతో అటువంటి కళాకారులకు నిత్యావసర సరుకులు అందజేశారు. రెండొందల మందికి 10 కేజీల బియ్యం, 2 కేజీల కందిపప్పు, 2 కేజీల పంచదార, కేజీ ఉప్పు అర కేజీ కారం, పావుకిలో టీ పొడి, 2 లీటర్ల ఆయిల్, 2 కేజీల ఆట, పావు కిలో పచ్చడి రాజశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేశారు. మరో రెండు వందల మందికి నిత్యావసరాలు అందజేయనున్నారు. ‌

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి