రాజమౌళి కి కరోనా సోకినట్లు ట్విట్టర్ ద్వారా తెలియపరిచారు

0
49

కరోనా రోజు రోజు కి పెరిగిపోతున్నది ,ఇది చిన్నవారి కి ,పెద్దవారి కి అని తారతమ్యం లేకుండా అందరికి సోకుతున్నది  ,
ఓటమి ఎరుగని దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తనకు కరోనా సోకిందని స్వయంగా ట్వీట్ చేయడంతో టాలీవుడ్ లో కలకలం మొదలయింది. బాహుబలి చిత్రంతో యావత్ సినీ ప్రపంచాన్ని తనవైపు చూసేలా చేసిన జక్కన్న తనతో పాటుగా తన కుటుంబానికి కూడా కోవిడ్ 19 సోకినట్లు ప్రకటించారు. నిన్న రాత్రి జక్కన్న ట్వీట్ అలా చేయడమే ఆలస్యం ఇలా వైరల్ అయ్యింది. తనకు , తన కుటుంబానికి కరోనా సోకినప్పటికి పెద్దగా సింప్టమ్స్ అయితే లేవని కానీ డాక్టర్ల సలహా మేరకు హోం క్వారంటైన్ లో ఉంటున్నట్లు ప్రకటించారు.

జక్కన్న ట్వీట్ తో యావత్ టాలీవుడ్ షాక్ అయ్యింది. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే జక్కన్న కు కరోనా సోకడం ఏంటి ? అని దాంతో జక్కన్నా ….. మేమంతా ఉన్నాం …..త్వరగానే కోలుకుని వస్తావు అంటూ ధైర్యాన్ని కూడగట్టి ఇస్తున్నారు టాలీవుడ్ ప్రముఖులు. ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, మోలీవుడ్ , కోలీవుడ్ ఇలా అన్ని చిత్ర పరిశ్రమల నుండి జక్కన్నకు సపోర్ట్ లభిస్తోంది. తాజాగా రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ , చరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం రఫ్ షూటింగ్ ఎలా ఉంటుందో చూద్దామని ప్లాన్ చేశారు కానీ కరోనా విలయతాండవం చేస్తుండటంతో ఆపేశారు.
దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి త్వరగా కోలుకోవాలిని కోరుకుంటున్నది tollywood movie news

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి