రాజమౌళికి నెగెటివ్ మరో దర్శకుడికి పాజిటివ్

0
37
raja mouli

ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎట్టకేలకు కరోనా మహమ్మారి నుండి కోలుకున్నాడు. రాజమౌళి ఒక్కడు మాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యులు కూడా అందరూ కరోనా నుండి కోలుకున్నారు. ఈ విషయాన్నీ తెలియజేస్తూ త్వరలోనే ప్లాస్మా దానం చేస్తామని ప్రకటించారు. అయితే రాజమౌళి అలా ప్రకటించారో లేదో ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి కరోనా బారిన పడ్డానని , త్వరలోనే కోలుకుంటానని , కరోనా తగ్గినా తర్వాత నేను కూడా ప్లాస్మా దానం చేస్తానని ట్వీట్ చేసాడు.

దాంతో టాలీవుడ్ లో కలకలం మొదలయ్యింది. షూటింగ్ లు చేయాలనీ ఆరాటపడుతున్న వాళ్లకు కరోనా బారిన పడుతున్న ప్రముఖులను చూసి వెన్నులో వణుకు పుడుతోంది. రాజమౌళి కుటుంబంలో మొత్తం ఐదుగురికి కరోనా సోకగా అందరు కూడా 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉన్నారు. నిన్న మరోసారి టెస్ట్ చేయగా అందరికీ నెగెటివ్ వచ్చింది దాంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసాడు రాజమౌళి. ఇక అదే సమయానికి దర్శకుడు అజయ్ భూపతికి పాజిటివ్ అని తేలడంతో నాకు కరోనా సోకిందని ట్వీట్ చేసాడు అజయ్ భూపతి. 

మునుపటి వ్యాసంఒక బిడ్డకు తల్లి అయినప్పటికీ అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గడమే లేదు
తదుపరి ఆర్టికల్నాని సినిమాకు ఓటిటిలో భారీ ఆఫర్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి