షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న రాజమౌళి

0
63
rrr movie team

 

ఆర్ ఆర్ ఆర్ చిత్రం షూటింగ్ కి సిద్ధం అంటే అప్పటి నుండి ఆరు నెలల కాలం తర్వాత మాత్రమే రిలీజ్ అవుతుందని అందుకే ఆర్ ఆర్ ఆర్ విడుదల ఎప్పుడు అంటే నాకు కూడా తెలియదు అనే సమాధానం చెబుతానని షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాడు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. కరోనా మహమ్మారిన పడిన రాజమౌళి కుటుంబం ఇటీవలే కోలుకుంది. ప్రతీ రోజూ వేడి నీళ్లతో ఆవిరి పట్టడం , సమయానికి ఆహారం తీసుకోవడమే కాకుండా ఎక్కువ సేపు నిద్ర పోవడం కూడా త్వరగా కోలుకోవడానికి కారణం అని స్పష్టం చేసాడు రాజమౌళి.

ఇక ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే అది ఎప్పుడు విడుదల అవుతుందో ఇప్పుడే చెప్పలేనని , ఎందుకంటే నాకే తెలియదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ అంటూ వెళితే షూటింగ్ మొదలైనప్పటి నుండి ఆరు నెలల కాలంలో పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటానని కానీ ఏది కూడా మన చేతిలో ఉండదు కదా ! అని వేదాంతం చెబుతున్నాడు జక్కన్న. షూటింగ్ మొదలైన పది రోజుల్లో ఎన్టీఆర్ కు సంబందించిన విజువల్స్ బయటకు విడుదల చేస్తామని ఎన్టీఆర్ అభిమానులకు హామీ ఇచ్చాడు.

ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ అయితే చేయలేమని , ఎందుకంటే భారీ యూనిట్ కాబట్టి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్ చేయడం కష్టమే నని వ్యాక్సిన్ వచ్చాక మాత్రమే ఆర్ ఆర్ ఆర్ సెట్స్ మీదకు వెళ్తుందని స్పష్టం చేసాడు జక్కన్న. ఇక మహాభారతం సినిమా భారీ స్థాయిలో చేయాలనీ ఉందని కానీ దానికి పదేళ్ల సమయం పడుతుందని షాక్ ఇచ్చాడు రాజమౌళి. పదేళ్ల కాలం అంటే చాలా ఎక్కువే మరి.

మునుపటి వ్యాసంప్రభాస్ కు సారీ చెప్పిన మెగా మేనల్లుడు
తదుపరి ఆర్టికల్చిరంజీవి ఆచార్యలో విజయ్ దేవరకొండ
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి