నెగెటివ్ రోల్స్ చేస్తానంటున్న రాజ్ తరుణ్

0
30
raj tarun

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్యంగ్ హీరో రాజ్ తరుణ్ నెగెటివ్ రోల్స్ చేయడానికి రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. తాజాగా ఈ హీరో నటించిన ఒరేయ్ బుజ్జిగా చిత్రం విడుదల అయ్యింది ఆహ లో. ఈ సినిమా పై రాజ్ తరుణ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కానీ అతడి ఆశలపై ఈ సినిమా నీళ్లు చల్లింది. గతకొంత కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బందిపడుతున్న రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా తప్పకుండా విజయం సాధిస్తుందన్న ధీమాగా ఉండేవాడు కానీ నిన్న సాయంత్రం ఆహాలో విడుదల అయ్యింది. అయితే ఈ సినిమాకు అంతగా సక్సెస్ టాక్ అయితే రాలేదు.


ఇక ఈ సినిమా ప్రమోషన్ కోసం ఆన్ లైన్ ప్రమోషన్ చేస్తున్నాడు. అందులో భాగంగా నెగెటివ్ రోల్స్ చేయాలనీ నాకు ఆశగా ఉందని , నమ్మకంగా ఉంటూ మోసం చేసే కుర్రాడి తరహా పాత్రల పట్ల మోజు ఉందని తన మనసులోని మాటని బయట పెట్టేసాడు. రాజ్ తరుణ్ అంటే చాకోలెట్ బాయ్ అనే ఇమేజ్ ఉంది మరి అలాంటి రాజ్ తరుణ్ నెగెటివ్ రోల్స్ చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా ? అన్నది చూడాలి.

ఇక ఒరేయ్ బుజ్జిగా చిత్రం విషయానికి వస్తే …….. కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కెకె రాధామోహన్ నిర్మించారు. రాజ్ తరుణ్ సరసన మాళవిక నాయర్ , హెబ్బా పటేల్ నటించారు. ఈ సినిమాలో కొంతవరకు కామెడీ వర్కౌట్ అయ్యేలా ఉన్నప్పటికీ ఓవరాల్ గా మాత్రం సినిమా తేలిపోయిందని అంటున్నారు సినిమా చూసిన వాళ్ళు. ఈ సినిమా కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు కాబట్టి రాజ్ తరుణ్ కెరీర్ డైలమాలో పడినట్లే. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి