రాజ్ తరుణ్ సినిమా ఓటీటీలో

0
64
orey bujjiga in ott

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్యంగ్ హీరో రాజ్ తరుణ్ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. పాపం ఈ హీరో కు కొంతకాలంగా కలిసి రావడం లేదు. కెరీర్ తొలినాళ్ళలో వరుస విజయాలతో రేసులో దూసుకువచ్చాడు. కానీ అదే స్పీడ్ లో పలు చిత్రాలు అంగీకరించి వరుస ప్లాప్ లతో దెబ్బతిన్నాడు. తన మార్కెట్ ని కూడా కోల్పోయాడు. కట్ చేస్తే ప్రముఖ నిర్మాత కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రంలో హీరోగా నటించాడు ” ఒరేయ్ బుజ్జిగా ” అంటూ.

గుండెజారి గల్లంతయ్యిందే వంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి దర్శకత్వం వహించిన విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. నితిన్ హీరోగా నటించిన ఆ చిత్రంత్ దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ కుమార్ కొండా. దాంతో అక్కినేని నాగచైతన్య హీరోగా ఒక లైలా కోసం అనే చిత్రం వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కానీ ఓ మోస్తారు విజయాన్ని అందుకుంది. కట్ చేస్తే ఇప్పుడు ఒరేయ్ బుజ్జిగా అంటూ రాజ్ తరుణ్ తో కలిసి సినిమా చేసాడు.

ఈ సినిమా ఈ ఏడాది మార్చి నెలాఖరున లేదంటే ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేయాలనీ అనుకున్నారు కానీ కరోనా వల్ల కుదరలేదు. కట్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత ఓటీటీ రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అల్లు అరవింద్ ఓటీటీ అయిన ఆహా లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కి రానుంది. గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2 న ఒరేయ్ బుజ్జిగా స్ట్రీమింగ్ కి రానుంది. రాజ్ తరుణ్ , మాళవిక నాయర్ , హెబ్బా పటేల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. ఇక ఓటీటీ లో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని పొందుతుందో తెలియాలంటే అక్టోబర్ 2 వరకు ఆగాల్సిందే. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి