అల్లు అర్జున్ కోసం కన్నడ విలన్

0
29
raj deepak shetty villain in allu arjun movie

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కోసం కన్నడ విలన్ ని తెచ్చే పనిలో పడ్డాడు దర్శకులు సుకుమార్. ఇప్పటికే కన్నడ భామ రష్మిక మందన్న ని హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఇక ఇప్పుడేమో అల్లు అర్జున్ కోసం కన్నడ విలన్ ని కూడా దించుతున్నాడు సుకుమార్. ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటించిన రాజ్ దీపక్ శెట్టి అల్లు అర్జున్ పాలిట విలన్ అవుతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన రాజ్ దీపక్ శెట్టి సినిమాలో స్మగ్లర్ గా నటించనున్నాడు.

గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో చిత్రం రూపొందనుంది. శేషాచలం అడవుల్లో సాగనుండటంతో శేషాచలం అనే టైటిల్ ని పెట్టాలనే ఆలోచనలో ఉన్నారట. ఇంకా అయితే కన్ఫర్మ్ కాలేదు. మరిన్ని టైటిల్స్ ని పరిశీలిస్తున్నారు దర్శకులు సుకుమార్. అల్లు అర్జున్ ఊర మాస్ క్యారెక్టర్ పోషించనున్నాడట. ఇక రష్మిక మందన్న కూడా అల్లు అర్జున్ కు సరైన జోడీ అవ్వడం ఖాయమని భావిస్తున్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి