రఘు రామ కృష్ణంరాజు రాజకీయ ఎత్తుగడ

0
47
TMN logo
TMN logo

నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు రాజకీయంగా కొత్త ఎత్తుగడ వేసాడు. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఆగస్టు 5 న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగనున్న నేపథ్యంలో ఎంపీ పదవిలో కొనసాగుతున్నందున తనకు వచ్చే జీతాన్ని రామమందిర నిర్మాణానికి మూడు నెలల జీవితాన్ని విరాళంగా ప్రకటించాడు. రఘురామ కృష్ణంరాజు వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున నర్సాపురం పార్లమెంట్ స్థానం నుండి ఎన్నికయ్యాడు. అయితే గతకొంత కాలంగా రఘురామ కృష్ణంరాజు పై జగన్ అండ్ కో చాలా ఆగ్రహంగా ఉన్నారు.

ఇటీవల షోకాజ్ నోటీస్ కూడా అందించారు. పరిస్థితి చూస్తుంటే రఘురామ కృష్ణంరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయినట్లే అని తెలుస్తోంది అందుకే భారతీయ జనతా పార్టీకి దగ్గర అవుతున్నాడు. అందులో భాగంగానే రామమందిర నిర్మాణం కోసం జాతి యావత్తు ఆశగా ఎదురుచూస్తోందని కామెంట్ చేయడమే కాకుండా మూడు నెలల వేతనాన్ని విరాళంగా ప్రకటించాడు. ఈ లెక్కన రఘురామ కృష్ణంరాజు కాషాయ దళంలో కలిసినట్లే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి