రాధే శ్యామ్ ఫస్ట్ లుక్ పై విమర్శలు

0
28

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ ఫస్ట్ లుక్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఆ పోస్టర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే ఆ పోస్టర్ ఇతర సినిమాలను పోలి ఉండటమే. మెగా హీరో వరుణ్ తేజ్ – ప్రగ్యా జైస్వాల్ జంటగా నటించిన కంచె చిత్రం పోస్టర్ లాగే ఉంది రాధే శ్యామ్ ఫస్ట్ లుక్. అలాగే ఇతర కొన్ని సినిమాల పోస్టర్ లను పోలి ఉంది అంటూ ఆ పోస్టర్ లను కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో వదులుతున్నారు పలువురు నెటిజన్లు. కంచె పోస్టర్ ని ఎలా కాపీ కొట్టారంటూ ప్రభాస్ సినిమాపై ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

ఇక ఈ ట్రోల్స్ విషయం పక్కన పెడితే రాధే శ్యామ్ ఫస్ట్ లుక్ తో రికార్డుల మోత మోగిస్తున్నాడు ప్రభాస్. సోషల్ మీడియాలో లైక్స్ , షేర్ లతో హోరెత్తిస్తున్నారు ప్రభాస్ అభిమానులు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. యువి క్రియేషన్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో రూపొందుతోంది రాధే శ్యామ్. ఇక ఈ చిత్రాన్ని 2021 లో విడుదల చేయనున్నారు. అయితే ఇంకా కొంత షూటింగ్ ఉంది. కరోనా తగ్గితే అప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది రాధే శ్యామ్. అయితే ఈ ఏడాది సెట్స్ మీదకు వెళ్లడం కష్టమే అని తెలుస్తోంది ఎందుకంటే కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి మరి.  

మునుపటి వ్యాసంపెళ్లి నాటి ఫోటోని షేర్ చేసిన డాక్టర్ రాజశేఖర్
తదుపరి ఆర్టికల్esha rebha phots
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి