ప్రభాస్ పై ట్వీట్ చేసిన రాధే శ్యామ్ డైరెక్టర్

0
41
about prabhas radhee sham director

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్డార్లింగ్ ప్రభాస్ ని డైరెక్ట్ చేయాలనేది నా డ్రీమ్ , ప్రభాస్ తో సెట్ లో ఉండి షూటింగ్ చేస్తుంటే ఆ ఎక్స్ పీరియన్స్ వేరు అంటూ ట్వీట్ చేసాడు యువ దర్శకులు రాధాకృష్ణ కుమార్. గోపీచంద్ హీరోగా నటించిన జిల్ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు రాధాకృష్ణ. ఆ సినిమా అంతగా ఆడకపోయినా ప్రభాస్ తన తదుపరి చిత్రాన్ని చేసే ఛాన్స్ ఇచ్చాడు. దాంతో రాధే శ్యామ్ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే కొంత షూటింగ్ జరిగింది. ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రం యాక్షన్ తో పాటు రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కుతోందట.

పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఖచ్చితంగా థియేటర్ లో చూస్తారు అంటూ ట్వీట్ చేసాడు దర్శకుడు రాధాకృష్ణ. ప్రభాస్ లుక్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయని , స్టైలింగ్ అదిరిపోయే రేంజ్ లో ఉంటుందని కూడా అంటున్నాడు రాధాకృష్ణ. కథానుసారం ఎక్కువగా విదేశాలలో చిత్రీకరించాల్సి ఉంది అయితే ఇప్పటికే కొంత పార్ట్ ఫారిన్ లొకేషన్ లలో చిత్రీకరించారు. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫారిన్ షెడ్యూల్ కష్టం కాబట్టి హైదరాబాద్ లోనే మిగిలిన షూటింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అన్నీ కుదిరితే అక్టోబర్ నుండి అల్యూమినియం ఫ్యాక్టరీ లో షూటింగ్ జరుగనుంది. కోవిడ్ నియమ నిబంధనలను అనుసరించి ఈ షూటింగ్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్ర బృందం. ఇప్పటికే రాధే శ్యామ్ చిత్రం ఆలస్యమైంది కాబట్టి త్వరగా పూర్తి చేసి 2021 లో థియేటర్ లలో విడుదల చేయాలని భావిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ నుండి వస్తున్న చిత్రం కావడంతో రాధే శ్యామ్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి . అయితే ఆ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా ? అన్నది చూడాలి. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి