రాంగోపాల్ వర్మ ఆఫీసుపై దాడి

0
47

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆఫీసుపై నిన్న సాయంత్రం దాడి జరిగింది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో రాంగోపాల్ వర్మ కార్యాలయం ఉంది. అయితే సాయంత్రం అనూహ్యంగా కొంతమంది ఓయు స్టూడెంట్స్ పవన్ కళ్యాణ్ జిందాబాద్ , రాంగోపాల్ వర్మ డౌన్ డౌన్ అనుకుంటూ వర్మ కార్యాలయంలోకి జొరబడ్డారు. ఆఫీసు ఫర్నిచర్ స్వల్పంగా ధ్వంసం అయ్యింది. అయితే ఈలోపు అక్కడికి పోలీసులు చేరుకొని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. దాంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

అయితే ఈ దాడి సంఘటన గురించి స్పందించిన వర్మ ఇలాంటి వాటికి భయపడేది లేదని మరోసారి బస్తీమే సవాల్ అని సవాల్ విసిరాడు. నా ఆఫీసుపై దాడికి ప్రయత్నించిన వాళ్ళు పబ్లిసిటీ కోసం చేసి ఉంటారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళు నిజంగా పవన్ అభిమానులా ? లేదా జనసేన వాళ్ళా అన్నది నాకు తెలియదు. ఈ సంఘటన జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేయడం లేదు. నేను పవర్ స్టార్ అనే సినిమా తీస్తున్నాను అది పవన్ కళ్యాణ్ మీద అనే ఎందుకు అనుకుంటున్నారు అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు వర్మ. ఎవరెన్ని చేసినా భయపడేది లేదని రేపు పవర్ స్టార్ సినిమా విడుదల అవుతోందని మరోసారి స్పష్టం చేశాడు.

మునుపటి వ్యాసంపరాన్న జీవి చిత్రం ట్రైలర్
తదుపరి ఆర్టికల్రానా – మిహీక ల వెడ్డింగ్ ఇన్విటేషన్ అదరహో
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి