కరోనా భయాన్ని పక్కకు పెట్టి స్టార్ హీరో షూటింగ్ స్టార్ట్ 

0
78
షాకింగ్ న్యూస్ కింగ్ నాగార్జున షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇప్పటికే కరోనా భయంతో పలువురు స్టార్ హీరోలు , హీరోయిన్ లు భయపడుతుండగా కరోనా భయాన్ని లెక్కచేయకుండా నాగార్జున షూటింగ్ లో పాల్గొనడం సంచలనంగా మారింది. అయితే నాగార్జున పాల్గొన్నది బిగ్ బాస్ 4 సీజన్ కోసం. బిగ్ బాస్ వరుసగా మూడు సీజన్ లు కంప్లీట్ అయ్యాయి. మూడో సీజన్ కు అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. దాంతో నాలుగో సీజన్ కు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. బిగ్ బాస్ 4 కు కూడా నాగార్జునే కాబట్టి ప్రోమో కోసం షూట్ చేశారట.ఇక ఆ ప్రోమో ని స్టార్ మా లో ప్రసారం చేయనున్నారు. కరోనా ఎఫెక్ట్ తో ఎలాగూ అందరూ ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి బిగ్ బాస్ 4 హౌజ్ లో సోషల్ డిస్టన్స్ పాటిస్తూనే కార్యక్రమాన్ని డిజైన్ చేశారట. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ లోని ఏడెకరాల స్థలంలో ఇంతకుముందు బిగ్ బాస్ హౌజ్ సెట్ వేశారు దాంట్లోనే స్వల్ప మార్పులు చేసారట. దాంతో చాలా జాగ్రత్తలు తీసుకొని నాగార్జున ఈ బిగ్ బాస్ 4 ప్రోమో షూటింగ్ లో పాల్గొన్నాడు. మొత్తానికి ప్రోమో పని కానిచ్చాడు కానీ మిగతా ఎపిసోడ్స్ చేయాలంటే జనాల మధ్య లో చేయాలి దాన్ని ఎలా డిజైన్ చేశారో చూడాలి. జనాలు లేకుండా అయితే సమస్యే లేదు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి