ఆఫీసుని మూసేసిన పూరి జగన్నాధ్

0
16
puri new project

దర్శకులు పూరి జగన్నాధ్ తన ఆఫీసుని ఈనెల 31 వరకు మూసేస్తున్నట్లు ప్రకటించాడు. ఇంతకీ పూరి తన ఆఫీసుని ఎందుకు మూసేసాడో తెలుసా ……. కరోనా ఎఫెక్ట్ తో. కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది దాంతో అది మరింతగా స్ప్రెడ్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు పూరి. స్టాఫ్ ఆఫీసుకి రావడం వల్ల అది మరింతగా వ్యాప్తి చెందొచ్చు అన్న అనుమానంతో నిర్ణయం తీసుకున్నట్లు ఛార్మి ప్రకటించింది.

హీరోయిన్ గా వెలుగు వెలిగిన ఛార్మి తన స్టార్ డం కోల్పోవడంతో నిర్మాతగా మారింది. తనతో జ్యోతిలక్ష్మీ వంటి చిత్రాన్ని చేసిన పూరి కి కనెక్ట్ అయ్యింది ఛార్మి దాంతో పూరి కనెక్ట్స్ అనే బ్యానర్ స్థాపించి బ్యానర్ మీద పూరి తో కలిసి సినిమాలను నిర్మిస్తోంది ఛార్మి. అయితే ఇస్మార్ట్ శంకర్ మాత్రమే సూపర్ హిట్ అయి మంచి డబ్బులు తెచ్చిపెట్టింది వీళ్లకు దాంతో ఇప్పుడు విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్నారు పూరిఛార్మి.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి