పూరి జగన్నాధ్ తో మళ్లీ స్టార్ హీరో సినిమా

0
21

దర్శకుడు పూరి జగన్నాథ్ తాజాగా ఫైటర్ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కంప్లీట్ అయ్యాక నటసింహం నందమూరి బాలకృష్ణ తో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడట పూరి జగన్నాథ్. ఇంతకుముందు బాలయ్య – పూరి జగన్నాథ్ ల కాంబినేషన్లో పైసా వసూల్ అనే చిత్రం వచ్చింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. సినిమా ప్లాప్ అయ్యింది కానీ బాలయ్య ని మాత్రం కొత్తకోణంలో చూపించాడు పూరి. అందుకే సినిమా పోయినప్పటికీ పూరి అంటే ఇష్టమట బాలయ్యకు. అలాగే బాలయ్య మనస్తత్వం తెలిసిన పూరి మళ్లీ బాలయ్య తో సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టాలని కసిగా ఉన్నాడట.

ప్రస్తుతం బాలయ్య బోయపాటి సినిమా చేయనున్నాడు. ఈ సినిమా తర్వాత సీనియర్ దర్శకుడు బి. గోపాల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని అనుకున్నాడట. కానీ ఆ కథ పక్కాగా రాకపోవడంతో బి. గోపాల్ సినిమాని పక్కన పెట్టాడట. దాంతో ఆ సినిమా స్థానంలో పూరి జగన్నాథ్ సినిమా వచ్చి చేరింది. ఇక ఈ సినిమాలో సరికొత్త బాలయ్య ని చూస్తారట. ఇప్పటికే బాలయ్య కు కథ చెప్పాడట కూడా. బాలయ్యకు కథ బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మొత్తానికి మరో మాస్ సినిమా రాబోతోంది అన్నమాట.

 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి