ఆసుపత్రిలో చేరిన పృథ్వీరాజ్

0
57
prudivi raj

 

 

టాలీవుడ్ నటుడు , ఎస్వీబీసి ఛానల్ మాజీ చైర్మన్ పృథ్వీరాజ్ ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరారు. గత 10 రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పృథ్వీరాజ్ అన్ని రకాల టెస్ట్ లు చేయించుకున్నారట. కోవిడ్ 19 టెస్ట్ లు కూడా చేయించగా కొన్నిసార్లు నెగెటివ్ అని మరికొన్ని సార్లు పాజిటివ్ అని రావడంతో ఏమి చేయాలో తెలీక సతమతం అవుతూ డాక్టర్లని సలహా అడగగా 15 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిందిగా కోరారట దాంతో ఆసుపత్రిలో చేరాడు పృథ్వీరాజ్.

తన ఆరోగ్యం పై ఆందోళన వ్యక్తం చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఓ వీడియో చేసి పోస్ట్ చేసాడు పృథ్వీరాజ్. అయితే ఆక్సిజన్ పెట్టుకొని ఉన్నాడు పృథ్వి. అలాగే ఆయాసం కూడా ఎక్కువగా ఉండటంతో పాపం సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు కూడా. టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించి టాప్ కమెడియన్ గా సత్తా చాటాడు పృథ్వీరాజ్. డైలాగ్ డెలివరీ లో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నాడు పృథ్వీరాజ్. కరోనా తో పోరాటం చేస్తున్న పృథ్వీరాజ్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తోంది టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి