నాని ‘వి’ సినిమా కథ ఇదేనంటూ తెగ ప్రచారం సాగుతోంది

0
469
v movie about story

నాని , సుధీర్ బాబు , నివేదా థామస్ , అదితి రావు హైదరీ తదితరులు నటించిన చిత్రం “వి ” . మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సి ఉండే కానీ కరోనా మహమ్మారి వల్ల లాక్ డౌన్ విధించారు కాబట్టి థియేటర్లు మూతబడ్డాయి కాబట్టి నాని వి విడుదల కాలేదు. కట్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత అమెజాన్ లో సెప్టెంబర్ 5 న స్ట్రీమింగ్ కి వస్తోంది. అంటే మరో 2 రోజుల్లో వి సినిమా చూడనున్నారు ప్రేక్షకులు.

దాంతో ఈ సినిమా కథ ఇదే అంటూ పెద్ద ప్రచారం జరుగుతోంది ఫిల్మ్ నగర్ సర్కిల్లో. ఇంతకీ వినబడుతున్న కథనం ప్రకారం ఈ కథ ఏంటో తెలుసా…….. 2007  డిసెంబర్ లో అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి బాత్ రూంలో హత్య చేసిన కేసు ఆంధ్రప్రదేశ్ అంతటా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయేషా మీరా అని యువతిపై అత్యంత దారుణంగా వ్యవహరించిన ఉదంతంలో ఇప్పటి వరకు కూడా కేసు ఎటూ తెగలేదు. పెద్ద వ్యక్తులు కాబట్టే రాజకీయ పలుకుబడి ఉన్న నాయకుడి మనవడు కాబట్టే ఈ కేసు తేలలేదు అని ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 13 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ కేసుని తేల్చడానికి రంగంలోకి దిగింది సీబీఐ.

ఆ కేసు ఆధారంగానే మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ కథ రాసుకున్నాడని , తనకు న్యాయం జరగలేదు కాబట్టి తన మనిషిని హత్య చేసిన వాళ్ళని ఒక్కొక్కల్ని ఒక్కో రకంగా చంపేస్తుంటాడని అదే ఈ వి చిత్ర కథ అని తెలుస్తోంది. అయితే ఫిల్మ్ నగర్ లో వినబడుతున్న ఈ కథనం నిజమా ? కాదా ? అన్నది మరో రెండు రోజులలో తెలిసిపోనుంది. ఎందుకంటే సెప్టెంబర్ 5 న వి సినిమా అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతోంది కదా.

మునుపటి వ్యాసంటాలీవుడ్ హీరోలు – వాళ్ళ రెమ్యునరేషన్
తదుపరి ఆర్టికల్‘క్రాక్‌’లో ర‌వితేజ్ కొత్త స్టిల్ విడుద‌ల
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి