పరశురామ్ పై ఆగ్రహంగా ఉన్న నిర్మాతలు

0
29
Producers who are angry at Parasuram

దర్శకుడు పరశురామ్ పై ఆగ్రహంగా ఉన్నారట 14 రీల్స్ అధినేతలు. అక్కినేని నాగచైతన్య హీరోగా మా బ్యానర్ లో సినిమా చేస్తానని చెప్పి పనులు మొదలు పెట్టి తీరా సెట్స్ మీదకు వెళ్లే సమయంలో మాకు హ్యాండ్ ఇస్తూ మైత్రి ఆఫీసులో కూర్చోవడం ఏంటి ? అని పరశురాం ని నిలదీస్తున్నారట నిర్మాతలు. గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనీ భావించాడు పరశురామ్.

అయితే చాలామంది చుట్టూ తిరిగాడు కానీ ఎవరూ పట్టించుకోలేదు దాంతో నిరాశపడిన పరశురామ్ నాగచైతన్య తో సినిమాని ప్రకటించాడు. కట్ చేస్తే మహేష్ బాబు నుండి పిలుపు రావడంతో నాగచైతన్య సినిమాని పక్కన పెడుతున్నట్లు తెలుస్తోంది దాంతో ఆచిత్ర నిర్మాతలు పరశురామ్ పై ఆగ్రహంగా ఉన్నారట. మా సినిమా చేస్తున్నావా ? లేదా ? చెప్పు ముసుగులో గుద్దులాటలు ఎందుకు ? అని ప్రశ్నిస్తున్నారట. మరి పరశురామ్ ఏమంటాడో చూడాలి.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి