ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న నిర్మాత

0
14
producer Kapali Mohan commits suicide in Bengaluru

కన్నడ నిర్మాత ఆర్ధిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంచలన సంఘటన కర్ణాటకలో జరిగింది. కన్నడంలో చిన్న చిన్న చిత్రాలను నిర్మించిన మోహన్ అలియాస్ కాపాలి మోహన్ తన హోటల్ లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు కర్ణాటక ముఖ్యమంత్రికి తన కుటుంబ పరిస్థితులను వివరిస్తూ వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటూ మరణ వాంగ్మూలం ఇచ్చాడు. తాను చనిపోయే ముందు ఓ వీడియోలో మాట్లాడి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. బెంగుళూర్ లోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సుప్రీం అనే హోటల్ ఉంది. ఈ హోటల్ నిర్మాత మోహన్ ది. అయితే హోటల్ తో పాటుగా తీసిన సినిమాల వల్ల కూడా నష్టాలు వచ్చాయి దాంతో అప్పుల పాలయ్యాడు మోహన్. ఆ ఇబ్బందుల నుండి బయటపడటానికి తనకు ఇంతకంటే మరో మార్గం కనిపించడం లేదని వాపోయాడు కాపాలి మోహన్. నిర్మాత ఆత్మహత్య చేసుకోవడంతో కన్నడ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి