జగన్ కు షాక్ ఇచ్చిన నిర్మాత అశ్వనీదత్

0
42
aswini dutt ,ap government

టాలీవుడ్ మూవీ న్యూస్, విజయవాడ-ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి షాక్ ఇచ్చాడు అగ్ర నిర్మాత అశ్వనీదత్. జగన్ సర్కారు మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కెక్కాడు అశ్వనీదత్. ఇంతకీ జగన్ సర్కారు మీద అశ్వనీదత్ కోర్టు కు ఎందుకు వెళ్ళాడో తెలుసా ……. గన్నవరం ఎయిర్ పోర్ట్ పక్కనే అశ్వనీదత్ కు దాదాపు 40 ఎకరాల భూమి ఉంది దాన్ని చంద్రబాబు హయాంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ అభివృద్ధి కోసం ఇచ్చాడు. కానీ జగన్ సర్కారు వచ్చాక అమరావతిని రాజధానిగా మార్చేసింది. దాంతో అమరావతిని రాజధానిగా కొనసాగించనప్పుడు గన్నవరం ఎయిర్ పోర్ట్ ని మరింతగా పెద్దగా చేయడంలో అర్ధం లేదని అందుకు నేను ఇచ్చిన 40 ఎకరాల భూమిని తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నాడు.

ఒకవేళ భూమిని తిరిగి ఇచ్చేలా లేకపోతే నాకు నష్టపరిహారంగా 210 కోట్లు చెల్లించాలని అందుకు జగన్ సర్కార్ ని ఆదేశించాలని కోరుతూ ఏపీ హైకోర్టుని ఆశ్రయించాడు అశ్వనీదత్. గన్నవరం పరిసర ప్రాంతాల్లో ఎకరానికి ఒక కోటి 84 లక్షల రేటు ఉందని దాని ప్రకారం 210 కోట్లు జగన్ సర్కారు చెల్లించాల్సిందేనని ఒకవేళ అలా కుదరకపోతే నా భూమి నాకు ఇచ్చేయాలని ఆదేశించాలని పిటీషన్ వేసాడు అశ్వనీదత్.

టాలీవుడ్ అగ్ర నిర్మాత అశ్వనీదత్ వేసిన పిటీషన్ ని విచారణకు స్వీకరించింది ఏపీ హైకోర్టు. విచారణ జరిగిన తర్వాత ఎలాంటి తీర్పు వెలవడనుందో చూడాలి. అశ్వనీదత్ తెలుగుదేశం పార్టీ సభ్యుడు అన్న విషయం తెలిసిందే. అందుకే అప్పుడు భూమి ఇచ్చాడు అయితే జగన్ సర్కార్ వచ్చాక రాజధానిగా అమరావతిని కొనసాగించడం లేదు దాంతో ఇలా హైకోర్టుని ఆశ్రయించాడు.తాజాగా అశ్వనీదత్ ప్రభాస్ హీరోగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని అల్లుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోంది. 

మునుపటి వ్యాసంప్రణతి న్యూ ఫొటోస్
తదుపరి ఆర్టికల్అన్నా డీఎంకే పార్టీ రెండుగా చీలనుందా ?
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి