విషమంగా ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం

0
54
pranab mukarji

మాజీ రాష్ట్రపతి , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమంగా ఉంది. ప్రస్తుతం కోవిడ్ తో పోరాడుతున్నాడు దాదా. 85 సంవత్సరాల ప్రణబ్ ముఖర్జీ మెదడులో ఏర్పడ్డ చిన్న అడ్డంకి కోసం ఆసుపత్రిలో చేరగా కరోనాతో బాధపడుతున్నాడన్న విషయం తెలిసింది. దాంతో కరోనా చికిత్స కూడా అందిస్తున్నారు వైద్యులు. అయితే పరిస్థితి విషమించడంతో ప్రణబ్ కోమాలోకి వెళ్ళాడు. వయసు కూడా మీద పడటంతో చికిత్సకు ఆశించిన స్థాయిలో స్పందించడం లేదు దాంతో ప్రణబ్ ముఖర్జీ చనిపోయాడంటూ పెద్ద ఎత్తున వదంతులు పుట్టుకొచ్చాయి.

దేశ వ్యాప్తంగా ఈ వార్తలు ప్రచారంలోకి రావడంతో ప్రణబ్ ఆరోగ్యం పట్ల పలువురు ప్రముఖులు వాకబు చేయడంతో ఎట్టకేలకు డాక్టర్లు దాదా ఆరోగ్యం గురించి వెల్లడించారు. దాదా కోమాలో ఉన్నారని , అయితే చికిత్సకు కాస్త స్పందిస్తున్నారని తెలిపారు. ఇక ప్రణబ్ ముఖర్జీ కొడుకు తీవ్ర అసహనం వ్యక్తం చేసాడు. ఇలాంటి గాలి వార్తలను ఎలా ప్రసారం చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసాడు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న ప్రణబ్ కాంగ్రెస్ పార్టీలో అలాగే కేంద్ర ప్రభుత్వంలో అన్ని కీలక పదవులను పొందారు. దేశంలోనే అత్యున్నతమైన పదవిని అలంకరించారు ప్రణబ్ ముఖర్జీ. 

మునుపటి వ్యాసంఇందిరాగాంధీగా విద్యాబాలన్
తదుపరి ఆర్టికల్చిరంజీవి ఒప్పుకుంటాడా ?
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి