ప్రముఖ నిర్మాత ఎం ఎస్ రాజు డర్టీ హరి సినిమా ట్రైలర్ విడుదల చేసారు

0
74
ప్రముఖ నిర్మాత ఎం ఎస్ రాజు మెగా ఫోన్ పట్టి యాక్షన్ కట్ చెప్పిన సినిమా డర్టీ హరి. ఈరోజు కొద్దిసేపటి క్రితం డర్టీ హరి ట్రైలర్ విడుదల చేసారు. శ్రవణ్ రెడ్డి , రుహాని శర్మ , సిమ్రత్ కౌర్ , సునీల్ తదితరులు నటించిన ఈ చిత్రం అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కడం విశేషం. ఎం ఎస్ రాజు అంటే క్లీన్ ఇమేజ్ వ్యక్తి అలాంటిది తన పంథా మొత్తం మార్చేసి అడల్ట్ కంటెంట్ వైపు వెళ్లి తీసిన చిత్రం ఈ డర్టీ హరి. 
తాజాగా విడుదలైన ట్రైలర్ లో సునీల్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. 
పూర్తిగా మాస్ మసాలా ఉన్న చిత్రంగా తయారయ్యింది ఈ డర్టీ హరి. అసలు టైటిల్ లోనే ఉంది డర్టీ దాంతో మరింత డర్టీ గా ఉన్నాయి ఉన్న సన్నివేశాలు. యూత్ ని అలరించే అంశాలతో పక్కా మసాలా చిత్రంగా రూపొందినట్లు తెలుస్తోంది సినిమా ట్రైలర్ చూస్తుంటే. ట్రైలర్ లోనే ఇంతగా రెచ్చిపోతే సినిమాలో ఇంకా ఎలాంటి సన్నివేశాలు ఉన్నాయో ఏమో అనేలా ఉంది. ఇద్దరు భామల అందాలు డర్టీ హరి ని మాత్రమే కాకుండా ప్రేక్షకులను కూడా సమ్మోహనపరిచేలా వున్నాయనిపిస్తోంది. మొత్తానికి ఎం ఎస్ రాజు తన రూటు మార్చి గేర్ పెంచాడు బాగానే ఉంది. అయితే ఈ రకమైన చిత్రాలతో విజయాలు సాధిస్తాడా ? లేదా ? అన్నది ప్రేక్షకులే తేల్చాలి. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి