రాహుల్ కు మద్దతుగా దిగిన ప్రకాష్ రాజ్

0
28
prakash raj support to rahul sipligunj

సినిమా వాళ్ళైతే చంపేస్తారా ? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు నటుడు ప్రకాష్ రాజ్. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై ప్రిజం పబ్ లో దాడి జరుగగా సంఘటనని తీవ్రంగా ఖండించాడు ప్రకాష్ రాజ్. ఈరోజు అసెంబ్లీకి వెళ్లిన ప్రకాష్ రాజ్ తనవెంట సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ని వెంట తీసుకుని వెళ్ళాడు. రాహుల్ పై దాడి చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసాడు. పబ్ కెళితే పదిమంది కలిసి రాహుల్ మీద దాడి చేయడం ఏంటి ? సినిమా వాళ్ళైతే చంపేస్తారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసాడు.

గచ్చిబౌలి లోని ప్రిజం పబ్ లో సింగర్ రాహుల్ పై ఎం ఎల్ రోహిత్ రెడ్డి తమ్ముడు దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే రాహుల్ తనకు న్యాయం చేయాలంటూ మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి చేసినప్పటికీ కేటీఆర్ నుండి ఎలాంటి రిప్లయ్ రాలేదు. తాజాగా ప్రకాష్ రాజ్ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ని కలవడానికి వచ్చిన ప్రకాష్ రాజ్ వెంటనే ప్రభుత్వం స్పందించాల్సిందిగా విజ్ఞప్తి చేసాడు. రాహుల్  ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్న రంగమార్తాండ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి