ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న ప్రకాష్ రాజ్

0
16
Prakash Raj appeals to the public

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని , ప్రభుత్వానికి అండగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నాడు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. కరోనా తో మనం యుద్ధం చేయాల్సి ఉంది కాబట్టి ప్రభుత్వ ఉన్నతాధికారులకు మనం సహకరించాల్సిన అవసరం ఉంది. బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాడు ప్రకాష్ రాజ్. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి విలయం సృష్టిస్తుందో మనందరికీ తెలిసిందే.

కరోనా వల్ల లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో తన దగ్గర పనిచేసే వాళ్లకు మే నెల వరకు ముందుగానే జీతాలను చెల్లించాడు ప్రకాష్ రాజ్. పని చేయకపోయినా తనని నమ్ముకున్న వాళ్లకు అండగా ఉండాలని భావించిన ప్రకాష్ రాజ్ ముందస్తుగానే జీతాలను చెల్లించాడు. అంతేకాదు కరోనా వైరస్ మరింతగా వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు కూడా. ఇంతగా ఎందుకు విజ్ఞప్తి చేస్తున్నారో తెలుసా ….. జనతా కర్ఫ్యూ కు భారతీయులంతా అండగా నిలిచారు కానీ లాక్ డౌన్ ని మాత్రం పట్టించుకోకుండా రోడ్ల మీదకు వచ్చారు జనాలు దాంతో ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రధాని మోడీ మళ్ళీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి