ప్రభాస్ సరసన ఏ హీరోయిన్ ని కన్ఫర్మ్ చేశారో తెలుసా

0
78

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన హీరోయిన్ ని కన్ఫర్మ్ చేశారు దర్శక నిర్మాతలు నాగ్ అశ్విన్ , అశ్వనీదత్. ప్రభాస్ 21వ చిత్రాన్ని సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా బాలీవుడ్ భామ దీపికా పదుకునే ని అధికారికంగా ప్రకటించారు. దీపికా పదుకునే కు  బాలీవుడ్ లోనే కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా ఉంది దాంతో ప్రభాస్ కు తగ్గ భామ దీపికా పదుకునే మాత్రమే అని భావించిన దర్శక నిర్మాతలు దీపికా పదుకునే కు భారీ రెమ్యునరేషన్ ఇచ్చి ఎంపిక చేశారట.

ఇక దీపికా పదుకునే కూడా చాలాకాలంగా తెలుగు సినిమాలో నటించాలని ఆసక్తి చూపిస్తోంది కానీ అది ఇన్నాళ్లకు అందునా ప్రభాస్ రూపంలో నెరవేరుతోంది. దీపికా పదుకునే మంచి పెర్ఫార్మర్ అలాగే విపరీతమైన క్రేజ్ కూడా ఉంది. ఆమె క్రేజ్ ప్రభాస్ సినిమాకు మరింత ప్లస్ అవుతుందని భావిస్తున్నారు నాగ్ అశ్విన్. ఇక దీపికా ప్రభాస్ తో రొమాన్స్ చేయాలని అనుకుంటోంది అది ఇప్పటికి నెరవేరుతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ అనూహ్యంగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఈ ఏడాది సెట్స్ మీదకు వెళ్లడం కష్టమే. 2021 లో సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి