ఆది పురుష్ కోసం కష్టపడుతున్న ప్రభాస్

0
42
prabhas hard work for adhipursh

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆది పురుష్ కోసం చాలానే కష్టపడుతున్నాడు. అసలే ప్రభాస్ ఆజానుబాహుడు అన్న సంగతి తెలిసిందే. అయితే పురాణాల ప్రకారం శ్రీరాముడు ఎనిమిది అడుగుల పొడవు ఉండేవాడట దాంతో ప్రభాస్ హైట్ ఎలాగూ ఎక్కువే కావడం కాబట్టి స్క్రీన్ పై మరింత హైట్ కనిపించేలా చూపించే ప్రయత్నం చేస్తున్నాడట దర్శకుడు ఓం రౌత్. 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది ఆఖరున అంటే డిసెంబర్ లో షూటింగ్ ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఓం రౌత్.

దాంతో ప్రతీ రోజూ ప్రభాస్ బాగానే వర్కౌట్లు చేస్తున్నాడట ఈ సినిమా కోసం. మంచి దేహ దారుఢ్యం ఉన్న హీరో ప్రభాస్ దాంతో ఉన్న శరీరాకృతిని మరింతగా మలిచి శ్రీరాముడిగా కనిపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ ఆది పురుష్ మొత్తం రామాయణం కాదు సోషియో ఫాంటసీ సినిమా దాంతో కొంత భాగం శ్రీరాముడిగా మరికొంత భాగం ఇప్పటి కథాంశం కూడా ఉండనుంది. సోషియో ఫాంటసీ వల్ల తప్పకుండా ప్రేక్షకులను మెప్పించే అంశాలు పుష్కలంగా ఉండటం ఖాయం.

ప్రభాస్ అభిమానులకు శుభవార్త : ఈ ఆది పురుష్ చిత్రంలో ప్రభాస్ ఏకంగా మూడు పాత్రల్లో కనిపించనున్నాడట. ఒకటేమో శ్రీరాముడి పాత్ర కాగా మరో రెండు పత్రాలు ఏంటి ? అన్నది ఇంకా రివీల్ కావాల్సి ఉంది. ఒకే సినిమాలో డార్లింగ్ ని మూడు పాత్రల్లో చూడటం అంటే డార్లింగ్ అభిమానులకు మాత్రమే కాదు యావత్ ప్రేక్షక లోకానికి కూడా సంతోషకరమైన వార్తే అని చెప్పాలి. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ప్రపంచ వ్యాప్తం అయ్యింది కాబట్టి ఆది పురుష్ తో మరింత సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి