ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్

0
261
Prabhas told the good news to the fans

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన అభిమానులకు శుభవార్త చెప్పాడు. ఎన్నాళ్ళో వేచిన ఉదయం అంటూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు ప్రభాస్ అభిమానులు. సాహో విడుదల అయి దాదాపు ఏడాది కావస్తోంది. ఆయినప్పటికి ప్రభాస్ కొత్త సినిమా తాలూకు విశేషాలు ఏవి కూడా ఫ్యాన్స్ కు తెలియకపోవడంతో ప్రభాస్ పై అలాగే యువి క్రియేషన్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బ్యాన్ యువి క్రియేషన్స్ అనే ట్రెండ్ క్రియేట్ చేశారు. మొత్తానికి ఫ్యాన్స్ బాధను అర్థం చేసుకున్న ప్రభాస్ తన సినిమా తాలూకు విశేషాలను జులై 10 న వెల్లడించనున్నట్లు ప్రకటించాడు.

తన ఇన్ స్టా గ్రామ్ లో ఈ గుడ్ న్యూస్ కు సంబంధించిన పోస్ట్ పెట్టాడు ప్రభాస్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి రాధేశ్యామ్ అనే టైటిల్ ని అనుకుంటున్నారు. టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ ని ఈనెల 10 న 10 గంటల తర్వాత విడుదల చేయనున్నారు. నిజంగా ప్రభాస్ అభిమానులకు పెద్ద శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే దాదాపు 11 నెలలుగా ప్రభాస్ కొత్త సినిమా తాలూకు వివరాలు తెలియాలని గట్టిగా కోరుకుంటున్నారు. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి