రిస్క్ తీసుకుంటున్న ప్రభాస్

0
40
radhee shyam shooting in italee

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చాలా రిస్క్ తీసుకుంటూ కరోనా సమయంలో ఇటలీ వెళ్ళాడు. అసలే కరోనా విలయతాండవం చేస్తున్న ఈరోజుల్లో ఇటలీ వెళ్లడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? తాజాగా ఈ హీరో రాధే శ్యామ్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆ సినిమా తాజా షెడ్యూల్ కోసం రాధే శ్యామ్ చిత్ర బృందం ఇటలీ వెళ్ళింది. ఇంతకుముందు కరోనా కంటే ముందుగా కొంత భాగం ఇటలీ లో షూటింగ్ జరిగింది దాంతో ఆ సమయంలో కొంత భాగం బ్యాలెన్స్ గా ఉండటంతో దాన్ని పూర్తి చేయడానికి ఇటలీకి వెళ్లారు ప్రభాస్ అండ్ కో.

ఇటలీలో కూడా కరోనా విలయతాండవం చేస్తోంది. ఇలాంటి సమయంలో అక్కడ డార్లింగ్ ప్రభాస్ షూటింగ్ పెట్టుకోవడం ఏంటి ? అని ఆందోళన చెందుతున్నారు డార్లింగ్ అభిమానులు. ఇటలీలో 20 రోజుల పాటు రాధే శ్యామ్ షూటింగ్ జరుగనుంది. అంటే మొత్తంగా దాదాపు నెల రోజుల పాటు అక్కడే ఉండటం అన్నమాట అంటూ ఈ నెల రోజులు డార్లింగ్ ప్రభాస్ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచనలు చేస్తున్నారు అభిమానులు.

ఎట్టకేలకు కరోనా వల్ల దాదాపు 7 నెలల పాటు షూటింగ్ కి దూరంగా ఉన్న ప్రభాస్ ఈరోజు నుండి షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇటలీలో ఈరోజు నుండి రాధే శ్యామ్ షూటింగ్ జరుగనుంది. ప్రభాస్ – పూజా హెగ్డే తదితరులపై కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు దర్శకుడు రాధాకృష్ణ. యాక్షన్ తో పాటుగా ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ – గోపికృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కావడంతో ఈ సినిమా కూడా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

మునుపటి వ్యాసం1992 డిసెంబర్ 6 న అసలు ఏం జరిగిందంటే
తదుపరి ఆర్టికల్ప్రగ్యా జైస్వాల్ న్యూ ఫొటోస్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి