ప్రభాస్ కు 14 రోజుల శిక్ష !

0
12
alia bhatt wants to act with prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు 14 రోజుల శిక్ష పడనుంది. హీరో ప్రభాస్ కు 14 రోజుల శిక్ష పడటం ఏంటి ? అని అనుకుంటున్నారా ? సినిమా షూటింగ్ కోసం జార్జియా వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు తిరిగి ఇండియాకు వస్తున్నాడు కాబట్టి తప్పకుండా 14 రోజుల పాటు గృహనిర్బంధంలో ఉండాలి అలా లేకపోతే కఠిన చర్యలు తీసుకోవడం ఖాయం. ఎందుకో తెలుసా ……. కరోనా ఎఫెక్ట్ బాబూ ! ప్రపంచాన్ని కుదిపేస్తున్న వైరస్ కరోనా.

అయితే కరోనా వైరస్ వ్యాపిస్తోంది అని తెలిసినప్పటికీ షూటింగ్ కోసం జార్జియా వెళ్ళాడు ప్రభాస్. షూటింగ్ అయిపొయింది కాబట్టి ఇండియాకు వస్తున్నాడు. అలా ఫారిన్ నుండి వచ్చిన వాళ్ళు కరోనా బారిన పడ్డారో లేదో తెలుసుకోవడానికి 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని ఆదేశాలు వెలువడిన సంగతి తెలిసిందే. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ 14 రోజులు ఇంట్లోనే ఉండాలి. అప్పుడే కరోనా సోకిందా ? లేదా ? అనే విషయం తేటతెల్లం అవుతుంది. కాబట్టి 14 రోజుల పాటు ప్రభాస్ కు శిక్ష ఖాయం అన్నమాట.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి