ఇంట్లోనే శిక్షణకు సిద్ధం అవుతున్న ప్రభాస్

0
55
prabhas starts training

ఇంట్లోనే శిక్షణకు సిద్ధం అవుతున్న ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా నటించనుండటంతో విల్లు ఎక్కుపెట్టే శిక్షణ తీసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. కరోనా విలయతాండవం చేస్తుండటంతో బయటకు వెళ్లి శిక్షణ పొందలేడు అందుకే మంచి ట్రైనర్ ని తన ఇంటికి పిలిపించుకుని ఇంట్లోనే విలువిద్యకు సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది.

ఎలాగూ కరోనా వల్ల షూటింగ్ లు లేకుండా పోయాయి. అందుకే ఖాళీగా ఉన్న ఈ సమయాన్ని విలువిద్య కోసం కేటాయించాలని అలాగే శ్రీరాముడు ఆకృతి కోసం తగిన వ్యాయామం కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ మంచి హైట్ కావడంతో శ్రీరాముడు పాత్రలో సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయమని భావిస్తున్నారు ప్రభాస్ అండ్ కో. ఇక ప్రభాస్ తీసుకున్న నిర్ణయం పట్ల డార్లింగ్ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.

తాజాగా ప్రభాస్ రాధే శ్యామ్ అనే చిత్రం చేస్తున్నాడు. ఆ సినిమా అయ్యాక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందనుంది. ఇక ఆ సినిమా తర్వాత ఆది పురుష్ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆది పురుష్ చిత్రం ప్రస్తుతానికి 500 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా అని తెలుస్తోంది. ఈ బడ్జెట్ మరింతగా పెరగొచ్చు కూడా ఎందుకంటే సెట్స్ మీదకు వెళ్ళాక షెడ్యూల్ లను బట్టి సెట్టింగులను బట్టి అలాగే నటీనటుల బట్టి. ప్రభాస్ శ్రీరాముడు బాగానే ఉంది కానీ సీత ఎవరు అని ప్రశ్నిస్తున్నారు ప్రభాస్ అభిమానులు. అనుష్క సీతగా నటిస్తే చూడాలని ఆశపడుతున్నారు మరి డార్లింగ్ అభిమానుల కోరిక నెరవేరుతుందా ? లేదా ? అన్నది తెలియాలంటే కొద్దిరోజులు ఎదురుచూడాల్సిందే.

మునుపటి వ్యాసంరేప్ కేసుపై స్పందించిన యాంకర్ ప్రదీప్
తదుపరి ఆర్టికల్అల్లు అర్జున్ పుష్ప కథపై కాపీ ఆరోపణలు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి